VZM: వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుల నియామకం జరిగిందని ఆ పార్టీ రాజాం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేశ్ తెలిపారు. రాజాం మున్సిపాలిటీ యూత్ అధ్యక్షుడిగా కొండంపేట గ్రామానికి చెందిన సలాది సతీష్, రాజాం యూత్ అధ్యక్షుడిగా మారేడుబాక గ్రామానికి చెందిన యాలాల వెంకటేశ్ నియమితులయ్యారని ఆయన చెప్పారు. పదవులకు న్యాయం చేస్తామని, మండలంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.