KDP: బి.మఠం(M)తోట్లపల్లె సమీపంలోని డాక్టర్ BR అంబేద్కర్ గురుకులంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి సీట్లు పొందని విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఈనెల 27న 10వ తరగతి విద్యార్థులకు, 30న ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు ర్యాంక్ కార్డు తీసుకురావాలన్నారు.