NLR: రాజకీయ కక్ష సాధింపులలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందని మాజీ MLA బుర్రా మధుసూదన్ యాదవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు. వ్యక్తులను ముందుగా టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులలో ఇరికించి జైళ్లకు పంపుతున్నారన్నారు. జగన్ చుట్టు ఉన్నవారిని అరెస్టులతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తుందని ఆయన మండిపడ్డారు.