KRNL: ఎమ్మిగనూరు పట్టణం సోగనూరు రోడ్డుకు సమీపంలో నిర్మాణం పూర్తి దశలో ఉన్న AP టిడ్కో గృహాలను MLA జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, గృహాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మొత్తం 1008 టిడ్కో గృహాలు నివాసానికి సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల పనులు తుది దశలో పూర్తవుతున్నాయన్నారు.