AKP: సంక్రాంతి సందర్భంగా 12న అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో తాడాట, తొక్కుడు బిల్ల, కర్రసాము, ఏడుపెంకులాట,తాడులాగుడు, గాలిపటాల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు. సాంస్కృతిక వారసత్వం ప్రోత్సహించే లక్ష్యంతో మహిళలు పురుషులకు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయన్నారు.