KDP: ప్రొద్దుటూరు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఒక్క సంవత్సరానికి కొబ్బరికాయలు అమ్మేందుకు వేలంపాట నిర్వహించారు. ఇందులో హెచ్చు పాటదారుడు శ్రీనివాసులు రూ. 2.43 లక్షలకు విక్రయశాలను తగ్గించుకున్నారు. ఆలయ ఛైర్మన్ డి. సత్యనారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి వెంకటరమణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.