సత్యసాయి: కదిరి పట్టణంలోని నిజాం వలి కాలనీలో పేకాట స్థావరంపై దాడులు చేసినట్లు టౌన్ సీఐ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గుట్టుగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు నిఘా ఉంచి నిజాం వలి కాలనీలో దాడి చేసి 7మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.1,12,420ల నగదు, 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.