అల్లూరి: డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీ గత్తరజిల్లెడ గ్రామంలో ఆదివారం సర్పంచ్ కొములు ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో 18 ఏళ్ళు దాటినవారు ఓటరుగా నమోదు కావాలని వీఆర్ఓ కోటేశ్వరరావు అవగాహన పరిచి, ఓటు నమోదుకు వారి నుండి వివరాలు సేకరించారు. ప్రస్తుత ఓటరు లిస్ట్ లోని పేర్లును మ్యాపింగ్ చేశారు. టీడీపీ బూత్ ఇంఛార్జ్ మోహన్ దాస్ ఉన్నారు.