ఉమ్మడి తూ.గో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎసీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14 బాలురు, అండర్-17 బాలికల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఈవో షేక్ సలీం బాష ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 4న అంబాజీపేట ఉన్నత పాఠశాలలో ఎంపికలు జరుగుతాయని, క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఎసీఎఫ్ సెక్రెటరీలను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.