NLR: రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం టీడీపీలో చేరిన ఇద్దరు కార్పొరేటర్ల బాటలో మరో వైసీపీ కార్పొరేటర్ అడుగులు పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ వైసీపీ కీలక కార్పొరేటర్ కోటంరెడ్డి సోదరులతో మంతనాలు పూర్తి చేశారు. మరో రెండు మూడు రోజుల్లో కోటంరెడ్డి సోదరుల సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.