SKLM: మహేంద్ర నది తనయ ప్రక్కన కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామి కార్తీక 23వ రోజు అష్టమి తిధి ప్రత్యేక పూజలు అందుకున్నారు. బుధవారం తెల్లవారుజాము స్వామివారికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.