PLD: అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయ పుష్కర ఘాట్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘాట్ల పరిసరాల్లో కొందరు బహిరంగంగా కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోందని, చెవిటికల్లు, కంచికచర్ల వెళ్లే పడవల పరిసరాల్లో, చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోయిందని తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నామన్నారు.