KKD: స్టీరింగ్ పాడవ్వడంతో ఓ బస్సు చెట్టును ఢీ కొట్టింది. సామర్లకోటకు చెందిన ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఇవాళ ఎల్లమెల్లి, సూరంపాలెం, పి. నాయకంపల్లి గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకుని తిరిగి వస్తోంది. పి. నాయకంపల్లి శివారు వద్ద రిపేర్ రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్పగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.