ATP: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రాష్ట్ర నూర్ భాషా సంఘం సమస్యలపై రాష్ట్ర వైసీపీ నూర్ భాషా సంఘం అధ్యక్షుడు రసూల్, గుత్తి మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు షఫీ, మహమ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్రంలో నూర్ భాషా సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ సీఎం జగన్ కు వివరించి, వినతి పత్రం అందజేశారు.