GNTR: టీడీపీ మంగళగిరి నియోజకవర్గ SC సెల్ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు వెలగపాటి విలియం(76) గుండెపోటుతో మరణించారు. శనివారం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని స్థానిక నాయకులు ఆయన సేవలను కొనియాడారు.