VSP: మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగు మండలాల్లోని 79 గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. ఇందులో ఆనందపురం మండలంలో 22, భీమిలి మండలంలో 26, పద్మనాభం మండలంలో 16, పెందుర్తి పరిధిలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయితీ ఎన్నికలలోగా విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.