కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానశాలకు భక్తులు వితరణ అందజేశారు. బుధవారం మచిలీపట్టణంకు చెందిన భక్తుడు ఉప్పాల రఘురాం దేవస్థానానికి 500 స్టీల్ ప్లేట్లు కానుకగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావుకు అందజేశారు. అనంతరం ఆలయంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.