GNTR: మాదక ద్రవ్యాల నియంత్రణపై గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. విద్యాసంస్థలు, హాస్టల్స్లో నిఘా పెంచాలని, ‘ఈగల్ క్లబ్బులు’ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 12 కేసుల్లో 42 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.