ATP: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా స్థాయి అండర్-15 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలకు సంబం ధించిన ట్రోఫీని శనివారం స్థానిక ఆర్జీటీ స్టేడియంలో జిల్లా క్రికెట్ సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈనెల 15వతేదీ వరకు సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు జరుగుతాయన్నారు.