SKLM: పాతపట్నంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం వైసీపీ ప్రభుత్వం చేపట్టిన తాగునీటి పథకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయి, నిర్వహణ లేక లీకేజీలతో నీరు వృథా అవుతోందని, వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారన్నారు.