KDP: కాశినాయన మండలం చెన్నవరంకి చెందిన పోతుగంటి హజరత్, వీరయ్యలకు జార్ఖండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ఆర్మీ ఉద్యోగి రూ.30 లక్షలు తీసుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొమరోలు మండలం సరెడ్డిపల్లెకి చెందిన ఆర్మీ ఉద్యోగి ఉప్పలపాటి దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు SI యోగేంద్ర తెలిపారు. మాయమాటలు చెప్పి మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలన్నారు.