GNTR: కొల్లిపర మండలం బొమ్మువారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్సై పి. కోటేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.