VSP: బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి ‘లైట్ ఆర్ట్ థీమ్ పార్క్’ను మంత్రి కందుల దుర్గేష్ గురువారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినోదాన్ని కోరుకునే వారికి వైజాగ్ ఒక ప్రసిద్ధ గమ్యస్థానమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన రోజువారీ జీవితం నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి ఈ థీమ్ పార్క్‌లు ఆహ్లాదాన్నిస్తాయని తెలిపారు.