KDP: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ నుంచి ఇప్పటివరకు రూ.1.87 కోట్లు వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ టెండర్ రూ.1.91 కోట్లకు కాంట్రాక్టర్కు కేటాయించగా, అందులో పెద్ద భాగం చెల్లించాడని, ఇంకా బకాయిగా ఉన్న రూ.4 లక్షలు రెండు నుంచి మూడు రోజులలోగా వసూలు చేసి ప్రక్రియను పూర్తిచేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.