VZM: కొత్తవలస శాఖ గ్రంథాలయంలో 58వ, జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారిణి ఎం. రామలక్ష్మీ ఇవాళ తెలిపారు. మొదటిరోజు బాలల దినోత్సవం నుంచి 20 వరకు వివిధ ఆటల పోటీలు జరుగుతాయని ఆమె చెప్పారు. ముగింపు రోజు అక్షరాస్యతా దినోత్సవం గెలిచిన అభ్యర్థులకు ముఖ్య అతిథులచే బహుమతి ప్రధానం చేస్తామని పేర్కొన్నారు.