CTR: సోమల మండలం బంగ్లా గ్రామంలో మే పుష్పం ఆదివారం వికసించింది. అరుదుగా కనిపించే ఈ పుష్పాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి కనబరిచారు. ప్రతి ఏడాది మే నెలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయని ఆ ఇంటి యజమాని శివయ్య నాయుడు తెలిపారు. ఈ పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉందని ప్రజలు తెలియజేశారు.