శేషాచలం అడవుల్లో నివసించే అరుదైన పునుగు పిల్లి రాజంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అడవిలో నుంచి తప్పిపోయి పట్టణంలోకి వచ్చి ఉండడంతో, బుధవారం రాత్రి కుక్కలు దాడిచేసి చంపి ఉంటాయని వారు అనుమానిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.