PLD: సత్తెనపల్లి 24వ వార్డులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలతో చౌట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువలు, ట్రాన్స్ఫార్మర్, కొత్త ఫెన్సింగ్ సమస్యలను జూన్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఉచిత బస్సు, ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరరావు, నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.