E.G: ఏపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజను తాడేపల్లిలో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి వినతి పత్రాలు అందజేశారు. పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గంలో కీలకమైన రోడ్ల అభివృద్ధి చేయాలని కోరారు. పుష్కరాలకు సంబంధించి రాజానగరం కీలక ప్రాంతమని తెలిపారు.