విశాఖ జిల్లా పాత పోస్టాఫీస్ వద్ద ఉన్న కొండ గుడి (రాస్ హిల్స్ ) పై ఉన్న మేరీ మాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చి మొక్కలు చెల్లించుకొని, ప్రార్థనలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ ఏటా జరిగే ఈ ఉత్సవానికి అనేక ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని వారు పేర్కొన్నారు.