ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు రూ. 21,36,476 లు విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.