అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారి మూలమూర్తికి ఆకు పూజ, సింధూరం పూజలు నిర్వహించారు. సాయంకాలం స్వామివారి ఉత్సవమూర్తికి వెండి రథములో కొలువు తీర్చి ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.