TPT: చెత్తరహితంగా మార్చేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి పిలుపునిచ్చారు. వైకుంఠపురం మార్కెట్లో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, మే 22 నుంచి జూన్ 20 వరకు నాలుగు వారాల పాటు ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.