BPT: జనవరి 6, 7న హైదరాబాద్లో జరిగిన ‘ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2026’లో బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు సత్తా చాటారు. ఆయన షాట్పుట్, డిస్కస్ త్రోలలో స్వర్ణ పతకాలు, జావలిన్ త్రోలో రజత పతకం సాధించారు. జాతీయ స్థాయిలో రాణించిన నాగరాజును బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ శుక్రవారం అభినందించారు.