SS: గోరంట్ల మండల కేంద్రంలోనీ స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సమాచార బోర్డుపై అధికారుల పేర్లు లేవు. దీంతో ఏ అధికారిని కలవాలో తెలియక రైతులు, ప్రజలు తికమక పడుతున్నారు. ఎవరు ఏ అధికారో, సమాచారం ఎవరిని అడగాలో తెలియక కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్డుపై సంబంధిత అధికారుల పేర్లు మార్చాలని కోరారు.