KRNL: పత్తికొండ పట్టణంలో నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇవాళ ఆదోని జిల్లా సాధన జేఏసీని ఏర్పాటు చేసి, కన్వీనర్‌గా బురుజుల నాగభూషణాన్ని ఎన్నుకున్నారు. సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదోని జిల్లా అవసరంపై చర్చించి, ఉద్యమాన్ని బలంగా కొనసాగించాలని తీర్మానించారు. సోమవారం నుంచి దీక్షలు ప్రారంభించాలని జేఏసీ నిర్ణయించింది.