TPT: ఎర్రచందనం స్మగర్లకు సహకరిస్తున్న ఓ పోలీసును అధికారులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ వివరాల మేరకు.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్తిరాజు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్మగర్లతో అతను కుమ్మక్కయ్యాడు. ఎర్రచందనం దొంగలకు అవసరమైన సమాచారం ఇస్తూ వాళ్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. అదాకారులు పక్కా ఆధారాలతో సత్తిరాజును అరెస్ట్ చేశారు.