KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం జరగబోయే శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కడప మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. ఈ మేరకు తన నివాసం వద్ద పోలీసులు ఆంక్షలతో కూడిన నోటీసులు జారీ చేశారని, ఎన్ని కేసులు పెట్టినా జగన్పై, పార్టీపై అభిమానం తగ్గదని, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని అంజాద్ బాషా స్పష్టం చేశారు.