VSP: ప్రధానమంత్రి అవాస్ యోజన (పట్టణ) 2.0లో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో 21 గృహాలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ PMAY గృహాల అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. బుధవారం సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు సొంత ఇల్లు ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.