కృష్ణా: గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి పామర్రులో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ను ఈరోజు నిర్వహించారు. పోలీసుల శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, సేవాభావాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని గుడివాడ డీఎస్పీ వినీల్ తెలిపారు. ఈ టెస్ట్‌లో సిబ్బంది ఫిజికల్ ఫిట్నెస్ స్థాయి, శారీరక సమర్థతను పరిశీలించారు.