కృష్ణా: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గన్నవరం ఏఈ వెంకటరాజ్ సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ వైర్లు లేని ఖాళీ ప్రదేశాలు మైదానాల్లో మాత్రమే గాలిపటాలు ఎగురవేయాలని సూచించారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు.