గుంటూరు నగరంలోని అంజుమన్ ఇ ఇస్లామియా పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, పిల్లలకు భవిష్యత్తు కల్పించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.