కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వెంకట్రావు పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కోటంక విజయ కుమారిని కోరారు. గన్నవరంలోని ఆయన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్తో ఆయన కలిసి నియోజకవర్గ రహదారుల స్థితిగతులపై ఈరోజు విస్తృతంగా చర్చించారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలన్నారు.