సత్యసాయి జిల్లాలో మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు.