VZM: ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో కొండవెలగాడ గ్రామానికి చెందిన పల్లవి బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె విజయంపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పల్లవి ప్రతిభను అభినందించిన రవిశేఖర్, గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.