BPT: చీరాల-బాపట్ల జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ, పొగ మంచు ప్రభావంతో పాటు డ్రైవర్‌కు నిద్ర మత్తు రావడంతో పందిళ్లపల్లి వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీకి స్వల్ప నష్టం వాటిల్లగా… డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.