W.G: భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, మరణించిన మరియు డూప్లికేట్ ఓటర్ల తొలగింపులో రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు.