E.G: రంపచోడవరం డివిజన్లో మాతా శిశు మరణాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నిర్లక్ష్యంగా ఉండే వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని ITDA. PO సింహాచలం హెచ్చరించారు. రంపచోడవరంలో వైద్య సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా ఉంటే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.