W.G: ఆకివీడు రైల్వే స్టేషన్ సమీపంలోని పడాల వారి వీధిలో శనివారం రాత్రి నాలుగేళ్ల చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానిక చింతా తేజస్విని అనే బాలిక తన తల్లితో కలిసి దుకాణానికి వెళ్తుండగా, ఒక్కసారిగా కుక్క ఆమెపై దాడి చేసి రెండు కాళ్లపై కరిచింది. తీవ్ర రక్తస్రావమైన బాలికను స్థానికులు కాపాడారు. ఈ ఘటనపై నగర పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు.