VSP: అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ రమ్య వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. గురువారం రాత్రి ఆయన ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత్ బాబులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.